Header Banner

ఓటీటీలో గత్తర లేపుతున్న సాయి పల్లవి థ్రిల్లర్ సినిమా.. ఏం సినిమారా అయ్యా! తల ప్రాణం తోకకు వచ్చింది!

  Thu Jun 12, 2025 11:00        Entertainment

నేటి సినిమాల్లో సస్పెన్స్, ఎమోషన్, సోషల్‌ మెసేజ్‌ కలగలిసిన సినిమాలు చాలా అరుదు. కానీ, ఇటీవల వచ్చిన ఓ మూవీలో మాత్రం అవన్నీ ఉన్నాయి. అది ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుంది. 2022 జులైలో విడుదలైన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా.. మంచి స్టోరీతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. అంతేకాదు చివరి వరకు మంచి థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సాయి పల్లవి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ గ్రాండ్ హిట్ అయింది. ఒక యువతి తన తండ్రిని రక్షించేందుకు చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా కథ. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. మహిళల జీవితాల్లోని సవాళ్లను, న్యాయ వ్యవస్థ లోపాలను ఈ సినిమా చాలా బాగా చూపించింది. ఆ సినిమా పేరే ‘గార్గి’ (Gargi). సాయి పల్లవి లీడ్ రోల్: ఈ సినిమాలో సాయి పల్లవి ‘గార్గి’ (Gargi) రోల్‌లో జీవించింది. ఒక టీచర్‌గా, తండ్రి కోసం పోరాడే యువతిగా ఆమె ఎమోషన్స్ అద్భుతం. అందుకే ఈ సినిమాకు సౌత్‌లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ లభించింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఒక సీన్‌లో సైలెంట్‌గా ఏడుస్తూ తన బాధను దాచుకునే తీరు హృదయాన్ని తాకుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులు పొగిడారు. ఆమెతో పాటు కాళీ వెంకట్, ఆర్.ఎస్. శివాజీ, సరవణన్ నటన కూడా నటించారు. గోవింద్ వసంత మ్యూజిక్‌ కథను మరింత ఎమోషనల్‌గా మార్చింది.

 

ఇది కూడా చదవండి: ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

 

న్యాయ పోరాటం: గార్గి తండ్రి బ్రహ్మానందం ఒక అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తాడు. ఆమె కుటుంబం మధ్యతరగతి, సామాన్య జీవితం గడుపుతుంది. గార్గి (Gargi) ఒక టీచర్‌గా, ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ జీవిస్తుంది. తండ్రిపై వచ్చిన ఆరోపణలు ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ఆమె ఒక అనుభవం లేని లాయర్ ఇంద్రన్స్ (కాళీ వెంకట్) సహాయంతో కేసు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో మీడియా, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి సవాల్‌గా నిలుస్తాయి. ఘోర నేరం: ఒక అపార్ట్‌మెంట్‌లో 9 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి కథను ముందుకు తీసుకెళ్తుంది. నలుగురు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కార్మికులపై ఆరోపణలు రాగా ఐదో వ్యక్తిగా గార్గి తండ్రి అరెస్ట్ అవుతాడు. పోలీసులు లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బాధిత బాలిక ఐదో వ్యక్తిని గుర్తించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ నేరం సినిమాకు ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఇస్తుంది. ఊహించని ట్విస్ట్: ‘గార్గి’ కథలో క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గార్గి తన తండ్రి నిర్దోషి అని కోర్టులో పోరాడుతుంది. ఈ క్రమంలో అతడి గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఈ ట్విస్ట్ మూవీకి హైలెట్. చివర్లో గార్గి తీసుకునే నిర్ణయం సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు కళ్లకు కడుతుంది. గార్గి’ టెక్నికల్‌గా కూడా అద్భుతం. శ్రాయంతి, ప్రేమ్‌కృష్ణ అక్కట్టు సినిమాటోగ్రఫీ సినిమాకు రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ స్టోరీని స్మూత్‌గా నడిపిస్తుంది. గోవింద్ వసంత మ్యూజిక్‌ సినిమాకు ఎమోషనల్ డెప్త్ జోడిస్తుంది. ఈ సినిమా 2 గంటల 20 నిమిషాల రన్‌టైమ్‌తో ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. సోనీ లివ్‌లో ఈ సినిమాను చూడొచ్చు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SaiPallavi #ManiRatnam #Fan #OTT #ThrillerMovie #Viral on ott